పవన్ వల్లే టీడీపీ ఓడిపోయింది-సుమన్

455
Suman Pawan kalyan
- Advertisement -

టీడీపీ ఓటమికి పవన్ కళ్యాణే కారణం అన్నారు హీరో సుమన్. పశ్చిమగోదావరి జిల్లాలో  ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టి సమన్యాయం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. జగన్ ప్రజల మధ్యలో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఎన్నో కష్టాలు పడి జగన్ సీఎం అయ్యారని కొనియాడారు.

తనకు ఉహతెలిసినప్పటి నుంచి ఒక రాజకీయ పార్టీ ఇంత ఎక్కువ శాతం ఓట్లు రావడం ఇదే తొలిసారి అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కారణమని అన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ చేసిన తప్పిదాల వల్లే చిత్తుగా ఓడిపోయిందని సుమన్ అన్నారు. మహిళలను గౌరవించి డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇచ్చిన ఘనత కూడా సీఎం వైఎస్‌ జగన్‌దేనని కొనియాడారు. ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే కేంద్రం విడుదల చేయాలని ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. అలాగే, సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సీఎం జగన్‌ను కోరారు.

- Advertisement -