జైపాల్‌ రెడ్డికి ప్రముఖుల నివాళి..!

413
jaipal reddy
- Advertisement -

నిన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డి (77) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలి లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దవాఖానలో చేరారు. జ్వరానికి చికిత్స పొందుతున్న ఆయన జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.పీవీ జ్ఞానభూమి పక్కన జైపాల్ రెడ్డి స్మృతి వనం ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైయ్యారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలు కాంగ్రెస్ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ లు హాజరైయ్యారు.

ఈ సందర్భగా గులాంనభీ ఆజాద్ మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం.. జైపాల్ రెడ్డి మంచి వక్త.. ఆయన మంచి సెక్యులర్..ఆయన ఏ పదవి చేపట్టినా దానికి మంచి పేరు తీసుకొచ్చారు. అని గులాం నభీ ఆజాద్‌ అన్నారు.

gulam nabhi ajad

మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి మరణం చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మ కు శాంతి చేకురాలని దేవున్ని ప్రార్ధన చేస్తున్న.. విద్యార్థి దశ నుంచే నాకు జైపాల్ రెడ్డి పరిచయం. ఆయన ఓ డిక్షనరీ లాంటి వ్యక్తి అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల్లో అందరికన్న మంచి వక్త… ఆయనకు ఆంగ్లంలో కూడా మంచి పట్టు ఉన్న నేత ఇలాంటి నేత మన మధ్య లేకపోవడం చాలా భాదాకరమని ఖర్గే అన్నారు.

కుంతియా మాట్లాడుతూ..సెక్యులరిజం, సోషలిజంకి చాంపియన్ జైపాల్ రెడ్డి..కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా..దానిని పాటించే వ్యక్తి.. నిబద్ధతతో ఉన్న మనిషి అని కుంతియ అన్నారు. ఆయన దేశంలో నే మంచి రచయిత, వక్త..ఆయన అన్ని రకాలుగా చరిత్ర సృష్టించారు..ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుతున్నని ఆయన అన్నారు.

కేరళ రాజ్యసభ సభ్యుడు పిసి చాకో మాట్లాడుతూ.. ఆయన నిబద్ధత కల్గిన వ్యక్తి..ఆయన తో ఉన్న పరిచయం గొప్పది..రాజ్యసభ లో ఆయన తో కలిసి పనిచేశాను..ఆయన మంచి సలహాలు సూచనలు చేశారు..పార్టీ ఇచ్చిన భాద్యత లు సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయాలు కి వన్నె తెచ్చారని చాకో తెలిపారు…

ఉత్తమ్ కుమార్ రెడ్డి..పిసిసి తరుపునా నివాళులు అర్పిస్తున్నాము.పలుమార్లు ప్రజాప్రతినిదిగా ఎన్నికైన గొప్ప వ్యక్తి జైపాల్‌ రెడ్డి.ఆయన కుటుంబం నికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో పలువు ప్రజా ప్రతినిధులు,ప్రముఖ నేతలు హారయ్యారు.

- Advertisement -