ఇది అక్కినేని ఫ్యామిలీ సెల్ఫీ..

255
selfie of Akkineni stars
- Advertisement -

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య…హీరోయిన్ సమంత ప్రేమలో ఉండగా వారు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. అక్కినేని అఖిల్‌.. శ్రియ భూపాల్‌ని వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది.

samantha

ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న శ్రేయా భూపాల్ తో అఖిల్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిని ఇటలీలో జరిపించేందుకు నిశ్చయించిన నాగార్జున, వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అఖిల్‌ నిశ్చితార్ధం త్వరలోనే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయనాయకులు,సినీప్రముఖులు హాజరవుతారని సమాచారం. స్టార్‌ హోటల్‌లో అఖిల్‌ ఎంగ్‌జ్‌మెంట్‌ జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా, ‘అఖిల్’ చిత్రం పరాజయం తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండాగా

- Advertisement -