బిగ్ బాస్ 3…నాగార్జున ఇంటివద్ద భారీ బందోబస్త్

259
Nagarjuna
- Advertisement -

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1,2లకు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఎంత హిట్ అయిందో అదే రేంజ్ లో విమర్శలు కూడా వచ్చాయి. త్వరలోనే బిగ్ బాస్ 3 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3 నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాలు కేసు పెట్టిన  సంగతి తెలిసిందే.

ఈ షోకు వ్యాఖ్యాతగా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈనెల 21న బిగ్ బాస్ 3 ప్రారంభంకానుంది. ఈ షో నుంచి నాగార్జున తప్పుకోవాలని బిగ్ బాస్ షో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్దులు పిలుపునిచ్చారు.

బిగ్ బాస్ షో ను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటి వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో నాగార్జున ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా నాగార్జున ఇంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు.

- Advertisement -