సుప్రీంలో చిదంబరానికి స్వల్ప ఊరట..!

426
chidambaram
- Advertisement -

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలుకెళ్లిన కాంగ్రెస్ నేత చిదంబరానికి సుప్రీం కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. చిదంబరాన్ని కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో సీబీఐ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఆయనను ఇప్పటికే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

చిదంబరానికి వయసుమీద పడిందని, పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపకుండా గృహనిర్బంధంలోగాని, సీబీఐ కస్టడీలోగాని ఉంచాలని ఆయన లాయర్‌ కపిల్ సిబాల్ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి విజ్ఞప్తి చేశారు.

chidambaram

దీంతో చిదంబరం సీబీఐ కస్టడీని మరోసారి పొడిగించొద్దని ఆయన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని సూచించింది సుప్రీం. చిదంబరాన్ని తీహార్ జైలుకు కూడా తరలించొద్దని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. కాగా, చిదంబరం కేసును కిందిస్థాయి న్యాయస్థానం విచారిస్తున్న సంగతి తెలిసిందే. 11 రోజులుగా సీబీఐ.. చిదంబరాన్ని ప్రశ్నిస్తోంది. దీనిపై సుప్రీంను ఆశ్రయించారు చిదంబరం తరపు న్యాయవాదులు.

అయితే, ఇప్పుడు కింది న్యాయస్థానం విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్థాపకులు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు తన కూతురు షీనా బోరా హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -