బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన సర్కార్‌..

218
vijay sarkar
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో తల విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’ .రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌,టీజర్‌,ట్రైలర్‌తో అంచనాలను పెంచేశారు విజయ్‌.

సినిమా టీజర్‌,ట్రైలర్‌లతో ఇప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాశారు విజయ్‌. అదే జోరును కంటిన్యూ చేస్తూ ప్రీరిలీజ్‌ బిజినెస్‌లోనూ సత్తాచాటాడు. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. తమిళనాడులో ఈ సినిమా 83 కోట్ల ప్రీ బిజినెస్‌ను రాబట్టింది. తమిళ నాడు లో ‘బాహుబలి 2’ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ కంటే ఎక్కువ కావడం విశేషం.

తాజాగా సెన్సార్ కార్యక్రామలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ పొందింది. విజయ్‌కి జోడీగా కీర్తిసురేష్‌ నటించారు. వరలక్ష్మి, రాధారవి, యోగిబాబు తదితరులు నటించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాడో లేదో చూడాలి.

- Advertisement -