పొలిటికల్ లీడర్ గా విజయ్..?

302
Sarkar: Vijay's introduction song to be shot in Las Vegas!
- Advertisement -

రజినీకాంత్‌ తరువాత అంతటి పేరు ఉన్న హీరో విజయ్‌. ప్రస్తుతం విజయ్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కార్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌లో విజయ్‌ చేసిన హంగామా అంతాఇంతా కాదు. సర్కార్‌ సినిమాలో విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా కనించబోతున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్టుగా ప్రటించింది చిత్ర యూనిట్.

Sarkar: Vijay's introduction song to be shot in Las Vegas!

విజయదశమి కానుకగా అక్టోబర్‌ 19 న విజయ్‌ సర్కార్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. విజయ్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్షీ శరత్‌ కుమార్‌ కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది చిత్రయూనిట్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన రోజే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు.

Sarkar: Vijay's introduction song to be shot in Las Vegas!

మురగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన కత్తి, తుపాకి సినిమాలు భారీ విజయాలను సాధించడంతో సర్కార్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -