సరిలేరు నీకెవ్వరు.. 25నిముషాలు మాత్రమే?

424
Sarileru Neekevvaru
- Advertisement -

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతుంది. ఈమూవీలో మహేశ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకుంది. ఇటివలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది.

Mahesh Babu

ట్రైన్ ఎపిసోడ్, రాయలసీమకు సంబంధించిన సీన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరణ చేస్తారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం.

ఈసినిమాకు సంబంధించిన ఇటివలే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. మహేశ్ ఆర్మీ లుక్ లో కనిపించారు. మహేశ్ ఈసినిమా మొత్తం ఆర్మీ లుక్ లోనే కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించారు చిత్రయూనిట్. ఈసినిమాలో మహేశ్ ఆర్మీ లుక్ లో కేవలం ఒక 25నిముషాలు మాత్రమే కనిపిస్తారని స్పష్టం చేశారు. ఈసినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించగా, బండ్ల గణేశ్ కమెడియన్ గా కనిపించనున్నారు.

- Advertisement -