మహేశ్ బాబు ‘మైండ్ బ్లాక్’ వీడియో సాంగ్

151
Mind Block Video Song

సూపర్ స్టార్ మహేశ్ బాబు రష్మీక మందన జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈసినిమాను దిల్ రాజు నిర్మించారు. జనవరి 11న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన ఈచిత్రం నేటితో 50రోజులు పూర్తి చేసుకుంది.

దేవి శ్రీప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈసినిమాలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. శ్రీమణి- దేవీశ్రీ అందించిన లిరిక్స్‌తో ‘మైండ్‌ బ్లాక్’ సాంగ్‌ రచ్చచేస్తోంది. మధ్య మధ్యలో మహేష్ వాయిస్, సింగర్స్ బ్లేజ్, రనీనా రెడ్డీ తమ ర్యాప్ టోన్‌తో సాంగ్ దుమ్ము లేచిపోయేలా చేశారు. ఈవీడియో విడుదల చేసిన కొద్ది సేపట్లోనే మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.