స‌రిలేరు నీకెవ్వ‌రు @ 50 Days

115
mahesh babu

ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆల్ టైం మూవీస్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. దిల్‌ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా చిత్ర యూనిట్ ప్రోమో వీడియో విడుద‌ల చేసింది.

ఇటీవల ఎక్కువగా సీరియస్‌, సందేశాత్మక చిత్రాలు మాత్రమే చేసిన మహేష్‌, ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించాడు. మాస్‌ యాక్షన్‌తో పాటు కామెడీ పంచ్‌లతోనూ ఆకట్టుకున్నాడు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య‌శాంతి ముఖ్య పాత్ర పోషించింది.