బాహుబలి రైటర్‌తో సప్తగిరి మూవీ…

369
Sapthagiri

కమెడీయన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటుడు సప్తగిరి. తాజాగా కళ్యాణ్ రామ్‌తో హరేరామ్ సినిమా తెరకెక్కించిన హర్షవర్ధన్‌తో సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ,కథనం అందిస్తుండటం విశేషం.

మంగళవారం ఈ సినిమా కంచిలో లాంఛనంగా ప్రారంభమైంది. రెయిన్‌బో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శైలేష్‌ వసందాని నిర్మిస్తుండగా విజయేంద్రప్రసాద్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకురానుంది. అక్టోబర్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్‌ శానమొని. విజయేంద్రప్రసాద్ రాజమౌళి చేస్తోన్న అన్ని సినిమాలకు కథల్ని అందిస్తూనే.. బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు.