సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్..

277
Saptagiri Weds Sunny Leone
- Advertisement -

కమెడియన్ గా కెరీర్ ఆరంభించి తరువాత హీరోగా సినిమాలు చేసిన వారిలో నటుడు సప్తగిరి ఒకరు.’సప్తగిరి ఎక్స్ ప్రెస్’అంటూ హీరోగా అతడు నటించిన తొలి సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమాగా ‘సప్తగిరి ఎల్ఎల్ బి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Saptagiri Weds Sunny Leone

ఇలా తను నటించిన రెండు సినిమాల్లో తన ఒరిజినల్ పేరు వచ్చే విధంగా టైటిల్ ను పెట్టారు మేకర్స్. ఇప్పుడు మూడో సినిమాకు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవ్వబోతున్నారు. ఆ టైటిల్ ఏంటంటే.. ‘సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్’. ఇలా తన పేరిటే వరుసగా మూడు సినిమాలు చేసే అదృష్టం ఇండియాలో ఇంతవరకు ఏ ప్రాంతీయ భాషా నటుడికి కూడా దక్కి వుండకపోవచ్చు అంటున్నాయి సినీవర్గాలు. త్వరలో రిలీజ్ కానున్న సప్తగిరి ఎల్ఎల్‌బీ కానీ హిట్ అయితే, ఇక నాలుగో సినిమా పేరులోనూ సప్తగిరి కచ్చితంగా వుండే అవకాశాలు లేకపోలేదేమో!

ఈ టైటిల్ పేరు నిజమైతే .. ఈ టైటిల్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోవడం ఖాయం. సన్నీ పేరును టైటిల్లోకి తెచ్చారంటే ఆమె ఈ సినిమాలో నటించినా నటించొచ్చేమో.

- Advertisement -