మోడీ బయోపిక్.. రంగంలోకి ప్రభాస్!

543
modi biopic
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 69వ పుట్టినరోజు నేడు. సినీ రంగం,వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు మోడీకి బర్త్ డే విషెస్ చెప్పగా తాజాగా సంజయ్ లీలా భన్సాలీ కూడా విషెస్ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మోడీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కగా భన్సాలీ కూడా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ‘మన్ బైరాగి’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా మోడీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్‌ను ప్రభాస్‌తో లాంచ్ చేయిస్తున్నారు భన్సాలీ. ఒక సాధారణ కుర్రాడి నుంచి ప్రధాన మంత్రిగా మోడీ ఎదిగిన క్రమంలో ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను తెరపై ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశానని వెల్లడించారు.

బాహుబలి సిరీస్‌తో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్. సాహోతో తన మార్కెట్‌ను మరింత విస్తరించారు.ఈ నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్‌ను తన సినిమాకు వాడుకోవాలని భన్సాలీ భావిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్లు ఉండగా భన్సాలీ వంటి దిగ్గజ దర్శక నిర్మాత… ప్రభాస్‌తో మోడీ బయోపిక్‌ పోస్టర్‌ను లాంచ్ చేయిస్తుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -