సంపూ పెద్దమనసు…వరద బాధితులకు సాయం

293
sampoornesh babu

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు. పేరడి సినిమాలతో అలరించే సంపూ తాజాగా కొబ్బరిమట్టతో మరోసారి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు. చిన్న హీరో అయినా తనది పెద్ద మనసు అని నిరూపించుకున్నాడు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటక చిగురుటాకులా వణుకుతోంది. వరదల వల్ల ఇప్పటివరకు 48 మంది ప్రాణాలు కోల్పోగా 2,738 గ్రామాలు వరదల ప్రభావంతో నష్టపోయాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు.

తాజాగా సంపూ నేను సైతం అంటూ తనవంతు సాయం అందించాడు. ఉత్తర కర్ణాటక వరదలు తనని కలిచివేశాయని ట్వీట్ చేసిన సంపూ..తనవంతుగా రూ. 2 లక్షల సాయం చేశారు. కన్నడ ప్రజలు తెలుగు సినిమాను దశాబ్దాలుగా ఆదరిస్తున్నారని …వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధేసిందని.. అందుకే ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నానని తెలిపాడు సంపూ.