పెళ్లి చీర గురించి చాలా భయపడ్డానుః సమంత

46
samantha

అక్కినేని సమంత నాగచైతన్య జంటగా కలిసి నటించిన చిత్రం మజిలీ. పెళ్లైన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో ఈమూవీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసినిమా భారీ విజయాన్ని సొంతంచేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు.. అంతేకాకుండా సమంత, నాగచైతన్య నటన అద్భుతంగా ఉందని చెబుతున్నారు ప్రేక్షకులు.

తాజాగా ఓ యాప్ లాంచ్ కార్యక్రమానికి హాజరయిన సమంత తన పెళ్లి చీర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన పెళ్లి చీర విషయంలో తాను చాలా టెన్షన్ పడ్డానని తెలిపింది. ఆ చీరను డ్రై వాష్ కు ఇచ్చిన తర్వాత వాళ్లు ఎలా చేస్తారోనని చాలా చెన్షన్ పడ్డానని చెప్పింది. డ్రైవాష్ ఎలా చేస్తారో..చీర ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయపడ్డానని తెలిపింది. డ్రై వాష్ నుంచి తిరిగి తన వద్దకు వచ్చాక చీర మొత్తం చూసుకుని ఉపిరి పీల్చుకున్నట్లు తెలిపింది సమంత.