బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న సమంత..!

591
samantha
- Advertisement -

దక్షిణాది అగ్ర హీరోయిన్లలో అందాలతార సమంత ఒక‌రు‌. సామ్ న‌టించిన సినిమాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ కావడంతో పాటు సినిమా సినిమాకు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించి మెప్పించిన సామ్ ప్ర‌స్తుతం 96 రీమేక్ చిత్రంతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 వెబ్ సిరీస్ చేస్తుంది.

తాజాగా టీ టౌన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ ఆఫర్‌ని తిరస్కరించిందట సమంత. సామ్ నటించిన యు టర్న్‌ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా హిందీలోను రీమేక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హిందీ రీమేక్‌లోను స‌మంత‌నే ప్ర‌ధాన పాత్ర కోసం ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా, ఈ ఆఫ‌ర్‌ని సామ్ రిజెక్ట్ చేసింద‌ట‌.

ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హల్ చల్‌ చేస్తుండగా సామ్ బాలీవుడ్ ఆఫర్‌ని తిరస్కరించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Samantha Akkineni is an Indian actress. She has established a career in the Tamil and Telugu film industries, and is a recipient of several awards including four Filmfare Awards.

- Advertisement -