హ్యాట్రిక్ హిట్‌ కొట్టిన…సమంత

277
Samantha for hatrick Hit
- Advertisement -

అక్కినేని వారింట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత అందాల భామ సమంత ఎక్కువగా ట్రెడిషినల్ లుక్‌లోనే కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నా.. సెలక్టెడ్ కథలకే పచ్చజెండా ఊపుతోంది. గ్లామర్ ఆరబోతను పూర్తిగా పక్కనబెట్టి, వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యమిస్తోంది. సమంత పెళ్లికి ముందు, పెళ్లి తరువాత అనేలా అటు మాస్‌ ప్రేక్షకులను, ఇటు క్లాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా పాత్రలను ఎన్నుకుంటూ మంచిపేరు సంపాదించుకుంటోంది.

వరుసగా మూడు హిట్ సినిమాలతో అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామలక్ష్మీగా అలరించింది. చెర్రీకి తగ్గ జోడిగా చక్కని హవభావాలను పలికించింది. రామ్‌చరణ్‌, సమంతల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ నిలిచిన మూవీ..సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

bhumika-u-turn

ఈ సినిమా తర్వా సమంత నటించిన మరో చిత్రం మహానటి. లెజండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మధురవాణి అనే జర్నలిస్టు పాత్రలో నటించి మెప్పించింది సమంత. సావిత్రి జీవిత కథను రాసే ఈ పాత్రలో సామ్ వంద శాతం న్యాయం చేసింది. సమంత చక్కని నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. తాజాగా విశాల్ హీరోగా తెరకెక్కిన ద్విభాష చిత్రం అభిమన్యుడులో నటించింది సమంత. ఈ సినిమా సైతం హిట్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సమంత ప్రతి సినిమాకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరించి హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం సమంత-ఆదిపినిశేట్టి కలయికతో వస్తున్న తాజా చిత్రం ‘యూటర్న్’ విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -