తెలంగాణ పోలీసులకు సెల్యూట్- సమంత,పూరి, రవితేజ

47
puri

దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు సెల్యూట్ అని హీరోయిన్ సమంత ట్వీట్ చేశారు. ‘భయానికి సరైన సమాధానం దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం’ అని ఆమె అన్నారు. ఈ ఘటనపై పూరీ జ‌గ‌న్నాథ్ స్పందిస్తూ.. సెల్యూట్‌.. తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే మా రియ‌ల్ హీరోస్. నేనెప్పుడు ఒక విష‌యాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే అంటూ పూరీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

disha case

తెలంగాణ పోలీసులు చేసినటువంటిది సాహాసోపేత మైన చర్య.. ఆమెకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. లీగల్ ప్రశ్నలు అనేవి తర్వాత వచ్చే విషయాలు. ఈరోజు జరిగిన ఘటన వలన దేశం మొత్తం శాంతియుతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అని బాబా రామ్ దేవ్ తెలిపారు. ‘ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇటువంటి ఘోర ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పించాలి. జైహింద్’ అని రవితేజ పేర్కొన్నారు. నిందితులను చంపేయడమే ఇటువంటి సమస్యలకు పరిష్కారమంటూ సినీనటులు ట్వీట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా.. తెలంగాన పోలీస్‌లపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తు పోస్ట్‌లు పెడుతున్నారు. సాహో.. సజ్జనార్‌ అంటూ.. పీసీ సజ్జనార్‌పై నెటిజన్స్‌ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్‌ వద్ద దిశ హత్యాచార కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.. పోలీసులపై దాడి చేయడంతో.. ఆత్మ రక్షణ కోసం.. వారు నలుగురు నిందితులపై ఎన్‌ కౌంటర్ చేశారు.