స‌మంత శ‌ర్వానంద్ జోడిగా ’96’

237
samantha sharwanad
- Advertisement -

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు త‌మిళంలో విజ‌యం సాధించిన 96 మూవీని తెలుగులో తెర‌కెక్కించ‌నున్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న తెలుగు శాటిలైట్ హ‌క్కుల‌ను కూడా తీసుకున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు దిల్ రాజు. ఇన్ని రోజులు ఈసినిమాలో బ‌న్నీ న‌టించ‌నున్నాడ‌ని వార్తులు వ‌చ్చాయి. కానీ బ‌న్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌నుండ‌టంతో మ‌రో హీరోను చూసుకున్నాడు దిల్ రాజు.

96-sharwand-samantha

తాజాగా ఉన్న‌స‌మాచారం ప్ర‌కారం శ‌ర్వానంద్ ఈమూవీలో హీరోగా నటించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. శ‌ర్వానంద్ కు జోడిగా స‌మంత న‌టించ‌నుంది. త‌మిళ వెర్ష‌న్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ కుమార్ తెలుగులో కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. శ‌ర్వానంద్ ఇటివ‌లే న‌టించిన ప‌డిప‌డి లేచేమ‌న‌సు సినిమా అంత పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. ఈమూవీతో ఎలాగైనా విజయం సాధించాల‌నుకుంటున్నాడు శ‌ర్వానంద్.

- Advertisement -