చైతు కోసం హీరోయిన్‌ను ఎంపిక చేసిన సమంత..

229
Majili movie
- Advertisement -

అక్కినేని హీరో నాగ చైత‌న్య ఇటీవ‌ల శైల‌జా రెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు నిరాశ ప‌ర‌చాయి. ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న స‌తీమ‌ణి స‌మంత‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం మ‌జిలీ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.పెళ్ళి త‌ర్వాత తొలిసారి నాగ చైత‌న్య‌, స‌మంత కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Majili movie

అయితే ఇప్పటివరకూ ఈ సినిమాలో సమంత మాత్రమే కథానాయిక అనుకున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని ఫిలింనగర్‌ టాక్‌ .. ఆమె పేరు ‘దివ్యాన్షా కౌశిక్’. ఈ అమ్మడు ఈ మూవీలో చిన్న అతిథి పాత్ర అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. సినిమలో ఫస్టాఫ్ అంతా కూడా చైతూతో ఆడిపాడనుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఆడిషన్ జరగగా, సమంతనే ఈ అమ్మాయిని ఎంపిక చేసిందట. ఈ నెల 26వ తేదీ నుంచి మరో షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్లో దివ్యాన్షా కౌశిక్ జాయిన్ కానుందని చెబుతున్నారు.

- Advertisement -