స‌ల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం

313
Salman Khan
- Advertisement -

బాలీవుడ్ హీరో, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం నెల‌కొంది. స‌ల్మాన్ ఖాన్ మేన‌ల్లుడు అబ్దుల్లా ఖాన్ మృతి చెందాడు. అబ్దుల్లా ఖాన్ గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. కాగా గ‌త రాత్రి ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దీంతో స‌ల్మాన్ ఖాన్ కుటుంబ స‌భ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

ఈవిష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నీ మరణం మాకు ఎనలేని విషాదాన్ని మిగిల్చింది. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అబ్దుల్లా ఖాన్ బాడీ బిల్డ‌ర్. గ‌తంలో స‌ల్మాన్ ఖాన్ ఆయ‌న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండేవాడు. అబ్దుల్లా మృతిప‌ట్ల బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -