షాకింగ్‌: రెమ్యునరేషనే రూ. 400 కోట్లు?

249
big boss salman

బుల్లితెర రియాల్టి షో బిగ్‌ బాస్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీలో బిగ్గెస్ట్ హిట్ కావడంతో షో నిర్వాహకులు తెలుగు,తమిళ్‌లో కూడా బిగ్‌బాస్‌ని తీసుకురాడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే హిందీ ఇప్పటివరకు వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్‌..తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు నోరెళ్ల బెట్టారట.

ఇప్పటివరకు 12 ఎపిసోడ్లు పూర్తి కాగా తాజాగా బిగ్ బాస్‌ సీజన్‌ 13 కోసం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌29 నుంచి బిగ్‌బాస్ సీజన్‌ 13 ప్రారంభం కానుండగా 2020 జనవరి 10న ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో ముగుస్తుంది.

ఇక ఈ సీజన్‌ కోసం కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.403 కోట్లు కావాలని అడిగారట. ఈ షోలో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండగా ఒక్కో ఎపిసోడ్‌కు సల్మాన్‌ రూ. 31 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది.

సల్మాన్ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయలేక సల్మాన్ అడిగిన పారితోషికాన్ని ఇచ్చేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నారట. ఇదే నిజమైతే ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ సల్మాన్‌ ఖానే అవుతారు.