సెక్యూరిటీ చెంప చెళ్లుమనిపించిన సల్మాన్ ఖాన్..(వీడియో)

351
salman
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమా రంజాన్ కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా రోజుల తర్వాత సల్మాన్ కు భారీ విజయం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిన్న ఉదయం భారత్ ప్రీమియర్ షో కు వెళ్లిన సల్మాన్ అక్కడ ఓ సంఘటన చోటుచేసుకుంది.

ప్రీమియర్ షో ముగించుకుని వెళ్తుండగా..తన సెక్యూరిటీ గార్డు చెంప చెళ్లుమనిపించాడు సల్మాన్. ఇది చూసి అక్కడున్న ఫ్యాన్స్ అంతా షాక్ కు గురయ్యారు. సల్మాన్ వస్తుండటంతో అక్కడే ఉన్న అభిమాని ముందుకు వస్తుండటంతో అతన్ని ప్రక్కకు లాగేశాడు సెక్యూరిటీ. దీంతో అది చూసిన సల్మాన్ ఆ సెక్యూరిటీ మీద చేయి చేసుకున్నాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -