భారత్.. సల్మాన్ ఫస్ట్ లుక్‌ అదిరిపోయింది

55

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న సినిమా భారత్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సందర్బంలో ఈ చిత్రం నుండి అదిరిపోయే లుక్‌ బయటికి వచ్చింది. దేశం మీద తనకున్న అభిమానాన్ని చాలా సినిమాల్లో చాటుకున్నాడు సల్మాన్. ఈ సినిమాలో కొత్త గెటప్‌తో కనిపించబోతున్నట్లు తెలిపినా.. ఫస్ట్ లుక్ విడుదల చేశాక అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. నెరిసిన గెడ్డం .. మెలితిరిగిన మీసాలు .. కొత్తరకం హెయిర్ స్టైల్ .. నలుపు రంగు ఫ్రేమ్ కళ్లద్దాలతో సల్మాన్ కనిపిస్తున్నాడు. ఈ డిఫరెంట్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాలో సల్మాన్ సరసన కథానాయికగా కత్రినా కైఫ్ నటిస్తుండగా, టబు .. దిశా పటాని .. జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో సల్మాన్ మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం సల్మాన్‌ న్యూ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Salman Khan