రాశీతో సాయిధరమ్‌కు… ‘ప్రతిరోజూ పండగే’

226
teju

చిత్రలహరి తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్‌ కొత్త మూవీ ఇవాళ ప్రారంభమైంది. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రతి రోజు పండగే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సాయిధరమ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో జరిగిన ఈ కార్యక్రమ ముహుర్తపు షాట్‌కు నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా జయకుమార్ సినిమాటోగ్రఫీలో మూవీ తెరకెక్కనుంది.

ఇక ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపిన తేజు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలని పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ప్రతిరోజూ పండగే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.