నానితో ప్రేమమ్‌ బ్యూటీ….

201
Sai Pallavi to romance Nani in his next with Dil Raju
- Advertisement -

ప్రేమమ్‌ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్‌ సినిమాలోని మలర్‌ అనే క్యారక్టర్‌తో ఎంత క్రేజీ సంపాందించిందో తెలుగులో కూడా సితార అనే క్యారక్టర్‌ ద్వారా అంతే క్రేజ్‌ తెచ్చుకుంది. కొంచెం కూడా మేకప్‌ లేకుండా తన ఒరిజినల్‌ అందంతో ఆకట్టున్న బ్యూటీ ఏవరైన ఉన్నరంటే అది సాయిపల్లవి మాత్రమే. సాయి పల్లవి ప్రస్తుతం వరణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫిదా’ చిత్రంలో నటింస్తుంది.

Sai Pallavi to romance Nani in his next with Dil Raju

తాజాగా సాయిపల్లవి నానితో కలిసి నటించేందుకు రెడీ అయ్యిందట. నేను లోకల్‌తో భారీ హిట్‌ కొట్టేసేని న్యాచురల్‌స్టార్‌నాని సరసన నటించేందుకు సాయిపల్లవి అంగీకరించిందట. దిల్‌ రాజు  బ్యానర్‌…వేణు శ్రీరమ్‌ దర్శకుడిగా నాని ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం సాయిపల్లవి ఎంచుకున్నారట. స్కిప్ట్‌ విషయంలో కానీ ఈసినిమాలో తన రోల్‌ విషయంలో  కానీ ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాలేదట ఈ మలయాళ బ్యూటీ. దర్శకుడు వేణు శ్రీరాం చెప్పిన క్యారెక్టర్‌కు పల్లవి ఫిదా అయిపోయిందట.

Sai Pallavi to romance Nani in his next with Dil Raju

కానీ సాయిపల్లవికి డేట్స్‌ విషయంలో మాత్రం కొన్ని ఎడ్జస్ట్‌మెంట్స్‌ చేసుకోవాల్సి ఉంటుందని….ఆపని పూర్తయ్యాక అగ్రిమెంట్‌ పై సైన్‌ చేస్తానని చెప్పిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘ఫిదా’ చిత్రంతో బిజీగా ఉన్న సాయిపల్లవి…యంగ్ హీరో సందీప్ కిషన్‌కు సరసన కూడా నటించేందుకు కూడా ఓకే చెప్పింది. ఓవైపు తమిళంలో కూడా ఛార్లీ చిత్రం కోసం బల్క్‌ డేట్స్‌ కేటాయించింది సాయిపల్లవి. దిల్‌రాజు బ్యానర్‌లో నాని హీరోగా వేణు శ్రీరాం డైరెక్షన్‌లో రూపోందే చిత్రానికి సాయిపల్లవి హీరోయిన్‌గా దాదాపు ఫిక్స్‌ అయిపోయినట్లేనని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. మొత్తం మీద ఈ మలర్‌ బ్యూటీ ఓవైపు తమిళ సినిమాలోను తెలుగు సినిమాలోను బిజీ అయ్యిపోయింది.

- Advertisement -