క్లాసికల్ డాన్సర్‌గా సాయిపల్లవి..!

66

అక్కినేని నాగచైతన్య మజిలీ తర్వాత మరోసారి ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధమౌతున్నాడు. ప్రస్తుతం చైతన్య- శేఖర్ కమ్ముల కాంబినేషన్ సినిమాకి ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే నటీనటుల ఎంపికలపైనా వార్తలు వచ్చాయి.

ఈ నెల 25 నుంచి ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట.నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి షెడ్యూల్లో చైతూ.. సాయిపల్లవి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట.

Sai Pallavi

ఇక ఫిదా మూవీతో తెలుగు ప్రక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్‌గా కనిపిస్తుందట. కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. చైతూ కెరియర్‌ను ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని చెబుతున్నారు. డిసెంబర్ నాటికి ఈ సినిమాను షూటింగును పూర్తిచేసి, వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయనున్నట్టుగా సమాచారం.