సాయిపల్లవికి సంతానం..!

228
sai pallavi
- Advertisement -

‘ఫిదా’ సినిమాతో జోరుమీదున్న సాయిపల్లవికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. మాలీవుడ్‌లో ప్రేమమ్‌ చిత్రంతో, టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్‌ ఇప్పుడు క్రేజీ నటిగా మారిపోయింది. తమిళంలో ఇప్పటికే విజయ్‌ దర్శకత్వంలో కరు చిత్రంలో నటిస్తున్న సాయిపల్లవి తాజాగా సంతానంతో జోడి కట్టానికి రెడీ అయింది. దర్శకుడు రాజేష్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో సంతానం సరసన హీరోయిన్‌గా ఆమె నటించనుంది.

santhanam

హాస్య నటుడిగా రాణించి ఆ తరువాత కథానాయకుడిగా మారిన సంతానం చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. సంతానం నటిస్తున్న సర్వర్‌ సుందరం, చెక్క పోడు పోడు రాజా, మన్నవన్‌ వండానడీ చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. కాగా, రాజేశ్ దర్శకత్వం వహించిన ఆరు చిత్రాల్లో ఐదింటిలో సంతానం నటించాడు. ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు.త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనుంది.

- Advertisement -