సంగీత దర్శకుడ్ని కాపాడిన మెగాహీరో..!

299
saidharam tej

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి మానవత్వం చాటుకున్నారు.సాయిధ‌ర‌మ్ తేజ్ చూపించిన మానవత్వంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వివ‌రాల‌లోకి వెళితే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణి బుధ‌వారం సాయంత్రం జూబ్లీ హిల్స్‌ నుండి బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ శివార్లలోని నానక్ రామ్ గూడలో ఉన్న రామానాయుడు స్టూడియోలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్, ఇంటికి కారులో బయలుదేరాడు.

saidharam

ఇంతలో మార్గంమధ్యలో ఓ టూ వీలర్, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడాన్ని చూశాడు. బైక్ పై ఉన్న వ్యక్తి దాదాపు పదడుగుల దూరం ఎగిరి పడటంతో, హీరో తేజు కారును ఆపించి, అక్కడికి వెళ్లి చూసి షాకైయ్యాడు. వాహనం ప్రమాదానికి గురైన వ్యక్తి మరెవరోకాదు, తన మిత్రుడు, సంగీత దర్శకుడు అచ్చు అని తెలుసుకుని, వెంటనే, తన కారులో అపోలో ఆసుపత్రికి తరలించాడు. ప్ర‌స్తుతం అచ్చుకు హాస్పిట‌ల్‌లో చికిత్స జరుగుతుండగా, అతని ప్రాణాలకు ప్రమాదం లేదని సమాచారం.