గుడ్ న్యూస్‌…సాహో రిలీజ్ డేట్ ఫిక్స్‌

267
sahoo release date

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం సాహో. సుజిత్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాషల్లో విడుదలవుతోంది. తొలుత ఆగస్టు 15న సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. కానీ అనివార్య కారణాల వల్ల సాహో విడుదల తేదీ వాయిదా పడింది.

అయితే ఎట్టకేలకు సాహో విడుదల తేదీపై ఉత్కంఠకు తెరదించారు చిత్ర నిర్మాతలు. ఆగస్టు 30న సాహో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సాహో రిలీజ్ డేట్ ప్రకటన ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పాలి. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా,జాకీ ష్రాఫ్,నీల్ నితిన్ ముఖేష్,మురళి శర్మ,వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తున్నారు.

గత ఆరేళ్లలో ప్రభాస్ చేసింది రెండు చిత్రాలు మాత్రమే. 2013లో మిర్చి సినిమా తర్వాత రెండేళ్లకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-ది బిగినింగ్ 2015లో విడుదల అయ్యింది. బాహుబలి-కంక్లూషన్ కూడా మరో రెండేళ్లకు 2017లో విడుదల చేశారు. తాజాగా మరో రెండేళ్లకు సాహో విడుదలవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.