500కోట్ల క్లబ్ లో “సాహో”

180
Sahoo censor

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత నెల 30వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుజిత్ దర్శకత్వం వహించన ఈమూవీలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మించింది. అయితే ఈసినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం పర్వాలేదు అనిపించుకుంది.

విడుదలైన 12రోజుల్లో ఈమూవీ 450కోట్లు వసూలు చేసిందని సమాచారం. తెలుగు రాష్ట్రాలలో కంటే బాలీవుడ్ లో ఈమూవీకి మంచి ఆదరణ లభించిందని చెప్పుకోవాలి. విడుదలైన 12 రోజుల్లో హిందీలో ఈ సినిమా 135 కోట్ల వసూళ్లను రాబట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లో 135కోట్లు వచ్చాయి.

ఈమూవీలో పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలను పోషించడం వల్లే బాలీవుడ్ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి ఇదో కారణమని అంటున్నారు. నైజామ్ వసూళ్ల విషయానికొస్తే, 12 రోజుల్లో 29.05 కోట్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరనుందని అంటున్నారు సినిమా విశ్లేషకులు.