లారెస్ అవార్డు షార్ట్‌లిస్టులో సచిన్‌

467
sachin
- Advertisement -

లిటిల్ మాస్టర్,భారత మాజీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత లారెస్ ఫౌండేషన్ అందించే అవార్డు కోసం నిర్వహిస్తున్న పోటీలో సచిన్‌ చోటు దక్కించుకున్నారు.

గత 20 ఏళ్ల కాలంలో క్రికెట్‌లో మధురమైన మూమెంట్లకు సంబంధించి లారెస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పోటీలో 2011లో సచిన్‌కు ఎదురైన అనుభవం చోటు దక్కించుకుంది.

భారత్ 2011 వరల్డ్‌కప్‌ సాధించాక సచిన్‌ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. మ్యాచ్ అనంతరం సచిన్‌ను భారత జట్టు సభ్యులందరూ తన భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. స్టేడియంలోని అభిమానుల కేరింతల మధ్య సచిన్‌కు అదో వండర్‌ఫుల్ మూమెంట్‌గా నిలిచింది. ఈ మూమెంటే ఇప్పుడు అవార్డుకు షార్ట్ లిస్ట్ అయింది.

ఆ క్షణాన్ని గురించి వర్ణిస్తూ వరల్డ్‌కప్ అందుకోవడం కోసమే తాను జీవించి ఉన్నానని సచిన్ భావోద్వేగంగా స్పందించాడు. వరల్డ్‌కప్‌ను సాధించడం కోసమే తాను క్రికెట్‌ను మొదలు పెట్టినట్లు సచిన్ అన్నాడు. ఫిబ్రవరి 17న జర్మనీలోని బెర్లిన్‌లో విజేతను ప్రకటించనున్నారు.

- Advertisement -