కూతకొస్తున్న క్రికెట్ గాడ్…

284
- Advertisement -

భారత మాజీ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రాబోయే ఫ్రొ కబడ్డీ లీగ్‌ (పికెఎల్‌) ఐదో సీజన్‌కు ఓ జట్టుకు ఫ్రాంఛైజీగా మారనున్నాడు. దేశవాళీ క్రీడా లీగ్‌ల్లో పలు ఫ్రాంఛైజీలకు సహ యజమానిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో ఐపిఎల్‌ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రో కబడ్డీలో కొత్త జట్టు తరపున ఎంట్రీ ఇవ్వనున్నాడు. చెన్నైకి చెందిన ఐక్వెస్ట్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లు కలిసి తమిళనాడు ఫ్రాంఛైజీని కొనుగోలు చేశారు.

దీంతో ఈసారి కబడ్డీ కబడ్డీ  కూత మరింత పెద్దగా వినిపించనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు జట్లు కొత్తగా చేరాయి. మొత్తం 12 జట్లతో దేశంలోనే అతిపెద్ద లీగ్‌గా అవతరించింది ప్రొకబడ్డీ. బడ్డీకి ఎక్కువ ఆదరణ లభిస్తున్న రాష్ట్రాలను ఎంచుకుని.. అక్కడ ఫ్రాంఛైజీ కోసం టెండర్లను ఆహ్వానించగా ఈ నాలుగు సంస్థలు బిడ్‌లు గెలిచాయని స్టార్‌ ఇండియా సీఈవో ఉదయ్‌ శంకర్‌ చెప్పారు. జులైలో ఆరంభమయ్యే సీజన్‌-5లో మొత్తం 11 రాష్ట్రాల నుంచి 12 జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి.

Sachin becomes co-owner of a Pro Kabaddi League team
పాఠశాల స్థాయిలో తాను క్రికెట్, టెన్నిస్, కబడ్డీ కూడా ఆడినట్టు భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన మనస్సులోని మాటను వెల్లడించారు. ముంబైలో జరిగిన ప్రో కబడీ లీగ్ ప్రారంభోత్సవానికి సచిన్ కుటుంబసమేతంగా హాజరయ్యాడు. ప్రో కబడీ లీగ్‌కు మద్దతు తెలపడానికే తాను ఇక్కడకు వచ్చానని సచిన్ అన్నాడు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో తాను క్రికెట్, టెన్నిస్‌తో పాటు కబడ్డీ కూడా ఆడినట్టు చెప్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు కబడ్డీ పోటీలు చూడటం చాలా ఆనందంగా ఉందన్నాడు. కబడ్డీ ఆటకు వేగం, చురుకుదనం, అప్రమత్తత చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ తారల సందడితో తొలిరోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

ప్రొకబడ్డీ సీజన్‌-5
ఎప్పుడు : జులై- అక్టోబరు
మొత్తం జట్లు: 12
మ్యాచ్‌లు : 130కిపైగా

ఇప్పటివరకు ఉన్న జట్లు:బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ దిల్లీ, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పట్నా పైరేట్స్‌, పుణెరి పల్టాన్‌, తెలుగు టైటాన్స్‌, యు ముంబా
కొత్త ఫ్రాంఛైజీలు: చెన్నై, అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, హరియాణా

.

- Advertisement -