‘సాక్ష్యం’ మూవీ ఫస్ట్‌ సాంగ్‌..

236
Saakshyam Movie First Single
- Advertisement -

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీను నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించి… ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాజిక్ అంతా బోయపాటిదే అయినా ఆ సినిమాతో బెల్లంకొండ బుల్లోడికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ హీరోకు మాస్ లో ఫాలోయింగూ బాగానే వచ్చింది. అయితే తాజాగా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Saakshyam Movie First Single

శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ‘సౌందర్యలహరి’ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

‘లహరి లహరి లహరి .. సౌందర్యలహరి’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జితిన్ .. ఆర్తి ఆలపించారు. నాయకా నాయికల మధ్య కొనసాగే ఈ పాట .. దృశ్య పరంగా థియేటర్లో మరింతగా ఆకట్టుకుంటుందనే అనిపిస్తోంది. ఈ సాంగ్ యూత్ ను బాగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే విడుదలకానుంది.

- Advertisement -