సాహో గేమ్‌…వారికి మాత్రమే

324
sahoo game

సాహో సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా సాహో గేమ్‌ని విడుదల చేసింది. సినిమాలానే గేమ్‌ని కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్‌లా డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి గేమ్ టీజర్‌ని రిలీజ్ చేయగా …గేమ్‌లో ఇంట్రెస్టింగ్ రౌండ్స్‌తో పాటు రివార్డ్స్ కూడా ఉన్నట్టు ఈ టీజర్ లో చూపారు.

అయితే ముందుగా ప్రకటించినట్టు ఈ గేమ్ రెండు వర్షన్స్ లో రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి యాపిల్ యూజర్స్ కోసం గేమ్ రిలీజ్ చేసిన యూనిట్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కూడా గేమ్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రం రన్ టైంను లాక్ చేశారు. వాస్తవానికి చిత్రం నిడివి మూడు గంటల వరకు వచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి…. 2 గంటల 48 నిమిషాలకు తగ్గించారట. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ జంటగా నటించగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.