మహాభారతంలో అర్జునుడిని..!

325
prabhas

ఆగస్టు 30న సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు ప్రభాస్. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. బాహుబలి తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా బెంగుళూరులో మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రభాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహాభారతం చేయాల్సి వస్తే అందులో ఏ పాత్ర చేయడానికి ఇష్టపడతారు అని అడుగగా, ప్రభాస్ అందులో ఎటువంటి పాత్రైనా చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. ముఖ్యంగా అర్జునుడు పాత్ర చేస్తాను..కర్ణుడి పాత్రంటే కూడా ఇష్టమని చెప్పారు. ఎప్పుడూ యాక్షన్ సినిమాలే కాదు భక్త కన్నప్ప లాంటి సినిమాలూ చేయడం ఇష్టమన్నారు.

ఈ మూవీ తర్వాత తాను లవ్ స్టోరీ కథతో ప్రేక్షకుల ముందుకువస్తున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగ్ కూడా జరిగిందని చెప్పారు. ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకువస్తానని తెలిపారు.

సాహోలో యాక్షన్‌కి పెద్ద పీట వేశాం…..ఒక్క ఫైట్‌ సీన్‌ కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఏడాదిన్నర పాటు షూటింగ్‌, ఆరు నెలల పాటు డిజిటల్‌ మిక్సింగ్‌ కోసం టైం కేటాయించామని చెప్పుకొచ్చారు ప్రభాస్.