ఇట్స్ షో టైమ్‌:నరాలు తెగే యాక్షన్ థ్రిల్లర్..సాహో టీజర్..

194
prabhas

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ వచ్చేసింది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించేలా.. రియలస్టిక్‌ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో టీజర్‌తో హై వోల్టేజ్ పెంచేశారు. కొద్దిసేపటి క్రితం విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే రెండు లక్షల వ్యూస్‌తో దూసకుపోతోంది.

బాధైనా,సంతోషమైనా నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరంటూ హీరోయిన్ చెప్పె డైలాగ్ తో మొదలయ్యే టీజర్లో నేనున్నాను అంటూ ప్రభాస్ అనడం,   వరు వీళ్లు అంటే డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ చెప్పడం టీజర్ కే హైలైట్‌గా నిలిచింది. ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్స్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తుండగా.. హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా యాక్షన్స్ సీన్స్‌లో ఇరగదీసింది.

బాహుబలి 2 లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే.. షేడ్స్ ఆఫ్ షాడో, చాప్టర్స్ 1, చాప్టర్ 2, ఫస్ట్ లుక్, యాక్షన్ సీక్వెన్సులతో క్రేజ్ పెంచేశారు మేకర్స్.

తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వస్తున్న ఈ సినిమాకు ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్టు 15 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహో టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి…