సాహో ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

475
prabhas
- Advertisement -

టాలీవుడ్‌ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్‌ జోష్‌ను ఇచ్చేలా సాహో ట్రైలర్‌ను వదిలారు చిత్ర బృందం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైల‌ర్ రిలీజ్‌ చేశారు. దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌భాస్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ఈ మూవీ ప్రభాస్‌ అశోక చక్రవర్తి అనే అండర్‌ కవర్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రూ.2వేల కోట్ల దోపిడికీ సంబంధించిన కేసును ఛేదించేందుకు పోలీసులు ఆయన్ను రంగంలోకి దింపే సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. శ్రద్ధాకపూర్‌.. అమృతనాయర్‌ అనే క్రైం బాంచ్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆ దోపిడీ కేసును ఎలా ఛేదించారు? అందులో ఎవరెవరి హస్తం ఉంది? ఈ కేసును ఛేదించే క్రమంలో అశోక్‌ చక్రవర్తి, అమృతనాయర్‌లకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియాలంటే ఆగస్టు 30 వరకూ వేచి చూడాల్సిందే. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తోంది.

ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేస్తుంది. సాహో చిత్రం యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుండ‌గా, ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.

- Advertisement -