400 కోట్ల క్లబ్‌లో సాహో..!

491
sahoo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం సాహో. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మిక్స్‌ డ్ టాక్ సొంతం చేసుకున్న వసూళ్లలో మాత్రం సత్తాచాటుతోంది.

తాజాగా సాహో రూ. 400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేస్తూ…. ఇంత కన్నా ఎక్కువ మీరు ఊహించగలరా అంటూ ట్వీట్ చేసింది.

సినిమాపై ఎంత నెగిటివ్‌ ప్రచారం జరిగినా ఆశాజనకంగా వసూళ్లు వస్తుండటం చిత్రయూనిట్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. మొదటి వారంలో సాహో రూ.370 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే ఇందులో బాలీవుడ్ నుంచే రూ.116 కోట్లు వచ్చాయి. 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే దానిలో రూ.130 కోట్లు బాలీవుడ్ నుంచి వచ్చాయి.