త్వరలోనే రైతులకు రుణమాఫీ: హరీష్ రావు

573
minister harishrao
- Advertisement -

త్వరలోనే రైతు లకు రుణమాఫీ చేస్తాం అన్నారు మంత్రి హరీష్‌ రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పర్యటించిన హరీష్ రైత లకు రైతు బంధుతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు విద్యుత్ డి ఈ, ఏ ఈ లకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. మన రాష్ట్రంలోని పథకాలకు ఆకర్షితు లు అవుతూ కర్ణాటక రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రంలో వాళ్లను కలపాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

అనంతరం జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్ణిస్తున్న జర్నలిస్ట్ కాలనీ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు సైతం కలిసివచ్చారు అదే భావనతో సీఎం కేసీఆర్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

harishrao

రాష్ట్రంలో 16,868 మందికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశాం , అలాగే హెల్త్ కార్డులను కూడా జారీ చేసాం.. 12600 జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు మరో 38వేల మంది కలిపి 52,996 మందికి ఆరోగ్య కార్డులు ఇచ్చామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి 100కోట్ల తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని, మానవీయ రీతిలో ఆదుకుంటున్నామని చెప్పారు. వివిధ కారణాలతో మరణించిన రాష్ట్రంలో 220 మంది పాత్రికేయుల కుటుంబాలకు 2.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

- Advertisement -