‘రూలర్’ రివ్యూ..

901
ruler movie review

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈ రోజే విడుదలైంది. అయితే ట్రైలర్, ప్రోమోలు అన్నీ ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమాను చూడబోతున్నామన్న భావనను కలిగించాయి. ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీ అని చెబుతున్నారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులను అలరిస్తుందని చెబుతున్నారు. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉందో చూద్దాం.

gt

కథ:
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో అర్జున్ ప్రసాద్ (నందమూరి బాలకృష్ణ), జయసుధకు వారసుడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళితే అక్కడ సోనాల్ చౌహన్ తారసపడుతుంది. మొదట ద్వేషించినా సోనాల్, అర్జున్ ప్రసాద్ కు పడిపోతుంది. వారి పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, అర్జున్ ప్రసాద్ కు, భవానీ నాథ్ అనే వ్యక్తితో గొడవ జరుగుతుంది. అర్జున్ ప్రసాద్ మీద అటాక్ చేయిస్తాడు భవానీ. అక్కడ కొన్ని ఊహించని పరిణామాలు అర్జున్ కు ఎదురవుతాయి. అతణ్ణి అందరూ ధర్మ అని పిలవడం మొదలుపెడతారు. అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అర్జున్ కు ఏమైనా గతముందా? వంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ః
ఈ సినిమాలో బాలయ్య లుక్ అదిరిపోయింది.అన్నీ తానై వ్యవహరించాడు. సినిమా అంతటా ఆయన చూపించిన ఎనర్జీ ఈ సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. అటు డ్యాన్సుల్లో కానీ ఇటు ఫైట్స్ లో కానీ బాలయ్య ఎక్కడా తగ్గలేదు. తనకలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫైట్స్ కూడా ఒక స్థాయి వరకూ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చిరంతన్ భట్ పాటలు, నేపధ్య సంగీతం మెప్పిస్తాయి. సంభాషణలు మెప్పిస్తాయి. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే గ్లామరస్‌గా కనిపించారు.

ruler_large

మైనస్ పాయింట్స్ః
దర్శకుడు మూస ఫార్మాట్ లోనే సినిమాను నడిపించాడు. కమర్షియల్ సినిమా అనగానే పాట, ఫైటు అన్న తరహాలో ఉండాలని భావించి అదే వే లో సినిమాను తీసుకెళ్లారు. తొలిభాగం ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడని చెప్పవచ్చు.. ముఖ్యంగా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో బోర్‌ కొట్టించాడు. లెంగ్తీ సీన్స్ కూడా సెకండ్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి.. బాలయ్య ఎనర్జీ తప్ప సినిమాలో అన్ని మైస్‌ పాయింట్సే..

తీర్పుః
రూలర్ ఆశించినట్లుగానే రొటీన్ గానే ఉంది. ట్రైలర్ లో చూస్తేనే కథ మీద ఒక అంచనాకు రావొచ్చు. అంతకు మించి ఈ కథలో ఏం లేదు. అయితే బాలయ్య ఈ సినిమాను లేపడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ధర్మగా బాలయ్య అదరగొడతాడు, అయితే ఆ పాత్ర లుక్ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్ధం కాదు. మొత్తంగా రూలర్ బాలయ్య అభిమానులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైట్లు, గ్లామర్ విందు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం బి, సి సెంటర్ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కాగల ఈ చిత్రం ఒక సగటు మాస్ మసాలా సినిమాగా మిగిలిపోతుంది.

విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019
రేటింగ్: 2.5/5
నటీనటులు:నందమూరి బాలకృష్ణ,వేదిక,సోనాల్ చౌహాన్
సంగీతం: చిరంతన్ భట్
నిర్మాత: సి కళ్యాణ్
దర్శకత్వం: కెఎస్ రవికుమార్