మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా

335
cm kcr

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఈ ప్రమాదంలో ఉన్నందున ఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికితీశారు. బోటులో మొత్తం 73 మంది ప్రయాణికులు ఉండగా ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది 27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. అదృశ్యమైన మరో 25 మంది కోసం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.