మైండ్‌ బ్లాక్‌..కడప,మల్కాజ్‌గిరిలో రూ.100 కోట్ల ఖర్చు.?!

344
revanth reddy

అదేదో సినిమాలో అన్నట్లు ఎన్నికల ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అన్నట్లు.. దేశంలో దూల తీరిపోయే సెంటర్లు ఎన్నో అంటూ హీరో చెప్పే లెక్కలు చూసి అంతా షాకవుతారు..?తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయపార్టీలు అనధికారికంగా చేసిన ఖర్చు చూస్తే అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. దేశం మొత్తం లోక్‌ సభ ఎన్నికల వ్యయం రూ. 55 వేల కోట్లు అయ్యాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్‌) నివేదిక పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మొత్తంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లు ఖర్చు అయ్యి ఉండొచ్చని తెలిపింది. తెలంగాణలో 16 మంది ఎంపీలకు రూ.400 కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 8 నియోజకవర్గాల్లో రూ.100 కోట్లకు పైగానే ఖర్చు అయ్యిందని పేర్కొంది. తెలంగాణలోని చేవెళ్ల, మల్కాజ్‌గిరి, నల్గొండ ఎంపీ స్ధానాలతో పాటు ఏపీలోని కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులలో రూ.100 కోట్లకుపైగా ఖర్చు అయ్యి ఉంటుందని పేర్కొంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు డైరెక్ట్‌గా ఓటర్లకు నగదు రూపంలో పంపిణీ జరిగిందని సీఎంఎస్‌ వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణకు రూ.10 వేల నుంచి రూ.12,000 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందని తెలిపింది.