కాళేశ్వరం అభివృద్ధికి రూ.100 కోట్లు:సీఎం కేసీఆర్

81
kcr kaleshwaram

కాళేశ్వరం అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం కేసీఆర్. పెద్దపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్న సీఎం..ముక్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. సతీమణి శోభ,ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం
మరో యాదగిరిగుట్టగా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి కోసం 100 నుంచి 400 ఎకరాల భూసేకరణ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం అర్చకులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మిస్తామన్నారు. కాళేశ్వరం ఆలయాన్ని రోజుకు లక్ష మంది దాకా భక్తులు దర్శించుకునేలా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

అంతకముందు ఆలయానికి సందర్శించిన కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనం అనంతరం గోదావరి నదిలో సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు సంకల్పం చెప్పారు.