‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వాయిదా..?

59
rrr

రామ్ చరణ్- ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ చిత్రాన్ని అన్ని పనులు పూర్తిచేసి జూలై 30న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగు మధ్యలో ఏర్పడిన కొన్ని అంతరాయాల వలన .. సాంకేతిక కారణాల వలన వాయిదా పడే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపించింది.

ఆ వార్త నిజమేనన్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుందని తెలియజేశాడు. అంటే ‘ఆర్ ఆర్ ఆర్’ దసరా బరిలోకి దిగుతుందనే అనుకోవాలి.

rrr

ఈ సినిమా ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ .. చరణ్ జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు.