భారీ రేటుకు ‘RRR’ ఓవర్సీస్ రైట్స్‌…!

68

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘RRR’.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ కూడా ఇందులో న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణంపై ప్రస్తుతం కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ టీమ్‌తో తొందర్లోనే రామ్ చరణ్ జాయిన్ కానున్నారని తెలుస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR

దాదాపు 400 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఇంకా నిర్మాణం పూర్తి కాక‌ముందే సినిమా బిజినెస్ మంచి క్రేజ్ ఏర్ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ పూర్త‌య్యింద‌ట‌. వివ‌రాల ప్ర‌కారం దుబాయ్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ అన్నీ భాష‌ల‌కు సంబంధించిన ఓవర్సీస్ హ‌క్కుల‌ను రూ.65 కోట్ల‌కు చేజిక్కించుకున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చైనా విడుద‌ల హ‌క్కుల మాత్రం ఆయ‌న‌కు ద‌క్క‌లేద‌ట‌. ఇక ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల కానుంది.