‘RRR’.. కొత్త విడుదల తేదీ ఖరారు..

631
rrr New release date
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఈ చిత్రబృందం నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. చిత్ర విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపిన ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్, మరో ట్వీట్ లో కొత్త తేదీని ప్రకటించింది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉంది.

2021 సంక్రాంతి కానుకగా జనవరి 8వ తారీకున ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల వచ్చిన సంక్రాంతి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. సంక్రాంతికి ఏ సినిమా విడుదల అయినా కూడా కాస్త పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు అవుతాయి. అందుకే సంక్రాంతిని జక్కన్న అండ్ టీం టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇంత సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండడం కష్టమే అయినా, ఎప్పటికప్పుడు చిత్ర సంగతులు పంచుకుంటామని… సినిమా క్వాలిటీగా రావాలంటే తప్పడం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

rrr

- Advertisement -