వికారాబాద్‌లో ఆర్ఆర్ఆర్..!

324
rrr

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరగనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో హీరోలు ఎన్టీఆర్, చరణ్ పాల్గొననున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. మొత్తం పది భాషల్లో సినిమా రిలీజ్ కానుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఇక దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుండగా ఒక్క క్లైమాక్స్ ఫైట్ కోసమే రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్‌. క్లైమాక్స్ పోరాట దృృశ్యాలు చూసే ఆడియెన్స్ మరో ట్రాన్స్‌లోకి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రోజుకో వార్తతో టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఆర్ఆర్ఆర్.