ఆగస్ట్ 15.. “ఆర్ఆర్ఆర్” ఫస్ట్ లుక్

213
RRR First look

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌ , ఎన్టీఆర్ లు హీరోలుగా మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు వర్కింగ్ టైటిల్ గా ఆర్ఆర్ఆర్ అనే పేరును ఖరారు చేశారు. ఈమూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తుండగా.. చరణ్ అల్లురి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

ఈసినిమాలో వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పటి వరకు ఈసినిమా నుంచి ఎటువంటి ఫస్ట్ లుక్ ను విడుదల చేయలేదు. ఇటివలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ విడుదల చేస్తారని భావించినా అభిమానులకు నిరాశే ఎదరురైంది.

అయితే ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు చిత్రయూనిట్. ఈ చిత్రం చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతుంది కాబ‌ట్టి మూవీ ఫ‌స్ట్ లుక్‌ని స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్‌ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలివుడ్ హీరోయిన్ నటిస్తోంది. 2020జులై 20న ఈసినిమాను విడుదల చేయనున్నారు.