స్పీకర్‌గా రోజా…జగన్ కేబినెట్ ఇదే..!

409
jagan roja
- Advertisement -

టీడీపీని మట్టికరిపించి అఖండ విజయం సాధించింది వైసీపీ. ఇక ఈ నెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్‌తో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యతను సంతరించకుంది.

వైసీపీ 150కి పైగా స్ధానాల్లో వైసీపీ గెలుపొందడంతో మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏపీ కేబినెట్‌లో 25 మందికే అవకాశం ఉండటం, అన్ని సామాజికవర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం ఉండేలా చర్యలు తీసుకొనున్న నేపథ్యంలో ఎవరిని అదృష్టం వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఎన్నికల ప్రచార సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు జగన్‌ ప్రకటించారు. చిలకలూరిపేట టిక్కెట్‌ని త్యాగం చేసినందుకు పార్టీ నేత మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. వీరు ముగ్గురుపోతే మిగిలింది 22 మందే. దీంతో జిల్లాల వారీగా మంత్రివర్గంలో తీసుకునే వారి పేర్లు,వారి శాఖల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : రోజా
డిప్యూటీ స్పీకర్ : పేర్ని నాని
రెవెన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్లు & భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కొడాలి వెంకటేశ్వర రావు
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్య : అవంతి శ్రీనివాస్
విద్య : అనిల్ కుమార్ యాదవ్
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : ఆర్కే
దేవాదాయ : కోన రఘుపతి
ఐటీ : అభయ్ చౌదరి
విద్యుత్ శాఖ : మేకపాటి గౌతమ్ రెడ్డి
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్
కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
సాంఘిక సంక్షేమం : కె.భాగ్యలక్ష్మి
వ్యవసాయం : మర్రి రాజశేఖర్
మార్కెటింగ్, పశుసంవర్థకం : బి. అప్పల నాయుడు
టూరిజం, తెలుగు సంస్కృతి : ఉదయభాను
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణ నిధి
ఇండస్ట్రీస్ : బాల్ రాజు

- Advertisement -